Monday, December 23, 2024

తన పుట్టిన రోజున… సిఎం ఆశీర్వాదం తీసుకున్న రెడ్కో ఛైర్మన్ సతీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తన పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఈ మేరకు సిఎం కెసిఆర్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి కెసిఆర్‌ని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్‌లో భాగంగా చేపట్టిన హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం చాలా పెరిగిందన్నారు. ఫలితంగా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని, తాగు,సాగునీటి కష్టాలు లేకుండా పోయాయని పేర్కొన్నారు.

త్వరలో చేపట్టనున్న లక్ష వృక్ష అర్చనలో ప్రతీ ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ ఖైరతాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈ మేరకు ఘనంగా జన్మదినవేడుకలు నిర్వహించుకున్నారు. రెడ్కో కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్కో సంస్థ వైస్ చైర్మన్, ఎండి జానయ్య ,జిఎం ప్రసాద్ , ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పలువురు బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, బిఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు సతీష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా అంతకు ముందు బిఆర్‌ఎస్ ఎంపి సంతోష్ కు మార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కను నాటారు. దేశంలో పచ్చదనం పెంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News