Sunday, December 22, 2024

ప్రేమలోని భావోద్వేగాలను చూపిస్తూ…

- Advertisement -
- Advertisement -

రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన ’యానిమల్’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ’నే వేరే’ పాటని విడుదల చేశారు మేకర్స్. ప్రేమలోని భావోద్వేగాలను సరికొత్తగా చూపిస్తూ… వివాహం తర్వాత తలెత్తే సంక్లిష్టమైన విభేధాలని ఈ సోల్‌ఫుల్ ట్రాక్‌లో చూపించారు. కార్తీక్ పాడిన ‘నే వేరే’ పాట.. లీడ్ పెయిర్ రణబీర్ కపూర్, రష్మిక మధ్య అనుబంధం, విభేదాలను లోతుగా చూపించింది.

ఈ పాటని శ్రేయాస్ పురాణిక్ స్వరపరిచగా.. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం ప్రేమలోని సంక్లిష్టమైన అంశాలను హత్తుకునేలా చూపించింది. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ టి-సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్‌పై యానిమల్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో గ్రాండ్ గా విడుదలవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News