Thursday, January 23, 2025

ఘనంగా శాట్స్ చైర్మన్ జన్మదిన వేడుకలు

- Advertisement -
- Advertisement -

అభినందించిన సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. తన పుట్టిన రోజును పురస్కరించుకుని శాట్స్ చైర్మన్ ప్రగతి భవన్ వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ శాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్‌కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు అందించారు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని సిఎం ఆకాంక్షించారు. మరోవైపు రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా శాట్స్ చైర్మన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక శాట్స్ కార్యాలయంలో చైర్మన్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, క్రీడాకారులు, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News