Sunday, December 22, 2024

ఇద్దరిని పెళ్లి చేసుకున్న సత్తి

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: ఓ యువకుడు ఇద్దరు ప్రియురాళ్లను ఒకేసారి పెళ్లి చేసుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెంలో జరిగింది.  చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన సత్తిబాబు ఇద్దరు యువతులను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో స్వప్న అనే అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు స్వప్న జన్మనిచ్చింది. గత కొంత కాలంగా స్వప్నకు సత్తిబాబు దూరంగా ఉంటున్నాడు. సునీత అనే యువతితో సత్తిబాబుకు పరిచయం ఏర్పడింది. సునీతకు సంతానం కలగడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. తనను కూడా పెళ్లి చేసుకోవాలని స్వప్ప పట్టుబట్టింది. మూడు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇద్దరిని సత్తిబాబు పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఇద్దరు భామల ముద్దుల మొగుడిగా మారాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News