Monday, December 23, 2024

నేటి రాశి ఫలాలు.. ఫలితాలు…(09/09/2023)

- Advertisement -
- Advertisement -

మేషం: ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి.అవసరాల మేరకు ధనం చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలుగుతాయి. దూరప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. స్వల్పంగా ఆర్థికలబ్ది పొందుతారు.

వృషభం: బంధువుల నుండి కీలకసమాచారం అందుకుంటారు నూతనవస్తువువాహనాలు కొనుగోలు చేస్తారు విందు వినోదాలుశుభకార్యాలలో పాల్గొంటారు ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తత అవసరం లేని పోని చికాకులు ఉంటాయి

 

మిథునం:చేపట్టిన నూతన కార్యక్రమాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు. శుభ ఆహ్వానాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఆధ్యాత్మిక దైవ చింతన ఏర్పడుతుంది. దాన ధర్మాలు చేస్తారు

 

కర్కాటకం:ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్య పరుస్తాయి. ఆకస్మిక ధనలాభం. మిత్రులను కలిసికష్ట సుఖాలలో పాలుపంచుకొని ఆనందంగా గడుపుతారు. శత్రువర్గంవారు మీ ఎదుగుదలను చూసి ఈర్షపడతారు. తస్మాత్జాగ్రత్త

 

సింహం:పోటీపరీక్షలు,ఇంటర్వ్యూలలోపాల్గొని విజయం సాధిస్తారు. పట్టుదల ఉంటే కానిదిలేదని నిరూపిస్తారు. నూతనప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. జీవితభాగస్వామి నుండిఆ స్తిలాభం పొందుతారు.వాహన ప్రయాణం జరభద్రం.

కన్య:ఆర్థిక పరిస్థితి కొంత మేరకు మెరుగు పడుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఉపశమనం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. సంతానపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. అనాలోచిత నిర్ణయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి.

 

తుల: తలపెట్టిన పనులలో ఇబ్బందులు ఎదురైన కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో సకాలంలో పూర్తిచేస్తారు. అధికారులమన్ననలు పొందుతారు. ఆర్థికంగా కలుసుబాటు ఉండదు. రుణబాధలు ఎదురై చికాకులు పెడతాయి. దూరప్రయాణాలు లాభిస్తాయి.

 

వృశ్చికం: సంఘంలో మీమాటకు విలువ పెరుగుతుంది. వృత్తివ్యాపారాలలో. ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది. భూవివాదాలు తీరి నూతన ఒప్పందలు కుదురుతాయి. ఆర్థిక అభివృద్ధి పుంజుకుంటుంది .జీవితభాగస్వామి మాటలు చికాకు తెప్పిస్తాయి.

 

ధనస్సు:కుటుంబసభ్యులనుమిత్రులనుకలిసిఆనందంగాగడుపుతారు.జీవితభాగస్వామినుండివిలువైనసమాచారంఅందుకుంటారు.ఆర్థికంగానిలబడతారు. స్వయం కృతాపరాధం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. చెడు లక్షణాలకు సాధ్యమైనంతవరకు దూరంగా ఉండండి.

 

మకరం: ఇంటాబయట మీదేపైచేయిగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగిన నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. రెట్టింపు ఉత్సాహంతో నూతన కార్యక్రమాలకు నాందిపలుకుతారు.

 

కుంభం: నూతన ఉద్యోగప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆస్తితగాదాలు తీరి నూతన పెట్టబడులు, ఒప్పందాలు కుదురుతాయి. సంతాన విద్యావిషయంలో తగుజాగ్రత్తలు అవసరం.గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

 

మీనం: చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్నికలుగ చేస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లువచ్చే అవకాశాలు ఉన్నాయి, తొందరపాటు నిర్ణయాలు మీకు కొంతఇబ్బందులు కలగజేస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారంచుడతారు.

someshwar sharma

సోమేశ్వర శర్మ – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News