Tuesday, January 7, 2025

సోమవారం రాశి ఫలాలు (06-01-2025)

- Advertisement -
- Advertisement -

మేషం: వృత్తి- ఉద్యోగ వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. శుభవార్తలు అందుకుంటారు వ్యాపారంలో లాభాలు బాగుంటాయి సమయపాలనతో పనులను పూర్తిచేయగలుగుతారు.

వృషభం: భవిష్యత్తు ప్రణాళికలు చేసుకుంటారు. పనులు సాఫీగా సాగుతాయి. మనసు చెడు విషయాల మీదకు మళ్ల కుండా జాగ్రత్తలు వహించండి. అధికారులతో అప్రమత్తంగా మెలగండి.

మిథునం: అనవసర ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. ధన విషయంలో జాగ్రత్తలు పాటించాలి.  ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం అవుతుంది.

కర్కాటకం: అనవసర విషయాలతో కాలాన్ని వృధా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉంటాయి ప్రారంభించబోయే పనుల్లో మంచి ఫలితాలు రాబడతారు. మీయొక్క రంగాల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది

సింహం: మీకు ఇష్టమైన వారితో కాలని గడిపే సూచన. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని ఇస్తాయి.

కన్య: శారీరక శ్రమ అధికం అవుతుంది. ఎదుటివారితో వాదులాటకు దూరంగా ఉండటం అన్ని విధాల మంచిది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం.

తుల: వృత్తి – ఉద్యోగాలలో మిశ్రమ వాతావరణం ఉండును. బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనో ధైర్యం  కోల్పోకుండా జాగ్రత్త వహించాలి.

వృశ్చికం: అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళనకు గురవుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాట దొర్లకుండ జాగ్రత్త వహించండి.

ధనుస్సు: ఆశించిన ఫలితాలు వెలువబడుతాయి. కీలక వ్యవహారాలలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది.

మకరం:  మీ రంగాల్లో చక్కటి శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్య విషయమై పై అధికారులతో మంతనాలు జరుపుతారు. వాటి తాలూకు ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి.

కుంభం: ప్రారంభించిన పనులలో తోటి వారి సహకారం మీకు లభిస్తుంది. కోపతాపాలకు వెళ్లకుండా ఆచితూచి ముందడుగు వేయాలి. బంధుమిత్రులతో ఆనందంగా గడపగలుగుతారు.

మీనం: ఆర్థికంగా పురోగతి బాగుంటుంది. దూరపు బంధువుల నుండి వచ్చిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News