Saturday, November 23, 2024

ఖేల్ రత్నకు సాత్విక్-చిరాగ్ జోడీ

- Advertisement -
- Advertisement -

క్రీడా పురస్కారాల రేసులో
హుస్సాముద్దీన్, షమి!

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రకటించే జాతీయ క్రీడా పురస్కారాల కోసం ఆయా క్రీడా సంఘాలు ఆటగాళ్లను పేర్లను సిఫార్సు చేస్తున్నాయి. ప్రతిష్టాత్మకమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్త్న్ర అవార్డు కోసం పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ స్పెషలీస్ట్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకి రెడ్డిచిరాగ్ శెట్టి పేర్లను సిఫారసు చేశారు. ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సాత్విక్ జోడీ అసాధారణ ఆటను కనబరిచింది.

పలు టైటిల్స్‌తో సత్తా చాటింది. దీంతో వీరి పేర్లను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్త్న్ర కోసం నామినేట్ చేశారు. తెలంగాణకు చెందిన స్టార్ బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్ పేరును కూడా క్రీడా పురస్కారం కోసం సిఫార్సు చేసినట్టు తెలిసింది. కామన్వెల్త్ క్రీడల్లో హుస్సాముద్దీన్ కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. హుస్సాముద్దీన్ పేరును అర్జున అవార్డు కోసం సిఫార్సు చేశారు. అంతేగాక తెలుగు రాష్ట్రానికి చెందిన భారత అంధుల క్రికెట్ టీమ్ కెప్టెన్ అజయ్ రెడ్డి పేరును కూడా అర్జున అవార్డు కోసం నామినేట్ చేశారు.

అర్జున రేసులో షమీ?

మరోవైపు టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమి పేరును అర్జున అవార్డు కోసం బిసిసిఐ సిఫార్సు చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇటీవల ముగిసిన వన్డ్ వరల్డ్‌కప్‌లో షమి అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో షమి ఏకంగా 24 వికెట్లను పడగొట్టి సత్తా చాటాడు. దీంతో షమి పేరును అర్జున అవార్డు కోసం బిసిసిఐ సిఫార్సు చేసినట్టు తెలిసింది. అర్జున అవార్డు కోసం షమి పేరును పరిశీలించాలని బిసిసిఐ అభ్యర్థించినట్టు వార్తాలు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News