Monday, December 23, 2024

భారత జోడీ సంచలనం

- Advertisement -
- Advertisement -

జకర్తా : భారత యువ జోడీ సాత్విక్-చిరాగ్ సంచలనం సృష్టించారు. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్‌లో టైటిల్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఈ ద్వయం అద్భుత ఆటతీరుతో వరుస గేమ్‌ల లో మలేషియా జోడీని ఓడించారు. దీంతో సూ పర్-1000 టైటిల్ గెలుచుకున్న తొలి భారత జోడీగా సాత్విక్-చిరాగ్ నిలిచారు. ఈ మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ 21-17, 21-18తో మలేషియా కు చెందిన ఆరోన్ చియా, వూయ్ యిక్ సోహ్ జోడీని ఓడించారు. ప్రపంచ ఛాంపియన్ జోడీపై సాత్విక్-చిరాగ్‌లకు ఇదే తొలి విజయం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో ర్యాంక్‌లో కొనసాగుతున్న భారత జోడీ తొలిసారిగా సూపర్-1000 టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది.

సూపర్-1000 టైటిల్ గెలుచుకున్న తొలి భారత జోడీగా వీరు రికార్డలకెక్కారు. అంతకుముందు జరిగిన సెమీ-ఫైనల్లో సాత్విక్-చిరాగ్.. కొరియా జోడీ మిన్ హ్యూక్ కాంగ్-సెయుంగ్ జే సియోను 17-21 21-19 21-18 తేడాతో ఓడించి టైటిల్ మ్యాచ్‌లో ప్రవేశించారు. కాగా, ఈ భారత యువ జోడీ ప్రపంచ ఛాంపియన్షిప్, థామస్ కప్, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలతో పాటు బిడబ్లూఫ్ టూర్ వంటి అన్ని విభాగాల్లో టైటిళ్లను గెలుచుకుంది. ఈ జోడీ ఖా తాలో ఒలింపిక్ పతకం మాత్రమే మిగిలుంది. ఈ ఏడాది స్విస్ ఓపెన్ సూపర్ సిరీస్ 300 టోర్నమెంట్లో సాత్వికాక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది.

2022 సంవత్సరంలో కామన్‌వెల్త్ క్రీడల్లో బంగారు పతకంతో సహా 3 టైటిళ్లను సాధించారు. వీరిద్దరూ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం కూడా సాధించారు. అయితే ఈ జోడీలో ఒకరైన ఆటగాడు సాత్విక్ కొంతకాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. గాయంమ కారణంగా ఫిబ్రవరిలో జరిగిన ఆసియా మిక్సిడ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు ఆడలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News