Friday, November 15, 2024

క్వార్టర్ ఫైనల్లో సాత్విక్‌ చిరాగ్ జోడీ..

- Advertisement -
- Advertisement -

కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన సాత్విక్‌సాయిరాజ్‌చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల విభాగంలో అశ్విని పొన్నప్పతానియా క్రాస్టొ జంట ప్రీక్వార్టర్ ఫైనల్లో విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో మాత్రం భారత స్టార్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. ఇంతకుముందే ప్రణయ్, లక్షసేన్‌లు ఓటమి పాలైన విషయం తెలిసిందే. పురుషుల డబుల్స్ విభాగంలో భారత అగ్రశ్రేజి జోడీ చిరాగ్‌సాత్విక్‌లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. కిందటి సీజన్‌లో ఆరు టైటిల్స్ సాధించిన ఈ జోడీ కొత్త సీజన్‌లో కూడా మెరుగైన ప్రదర్శనతో అలరిస్తున్నారు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ జంట 2111, 2118 తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన లాబర్‌కొర్వి జోడీని ఓడించింది.

ఆరంభం నుంచే సాత్విక్‌చిరాగ్‌లు దూకుడును ప్రదర్శించారు. ప్రత్యర్థి జంటకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ ముందుకు సాగారు. ఇదే క్రమంలో అలవోకగా తొలి సెట్‌ను అలవోకగా సొంతం చేసుకున్నారు. కానీ రెండో సెట్‌లో మాత్రం భారత జోడీకి ప్రత్యర్థి జంట నుంచి గట్టి పోటీ ఎదురైంది. కానీ చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన సాత్విక్ జంట సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. మహిళల డబుల్స్ భారత్‌కు చెందిన అశ్వినితానియా జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లో భారత జంట 2119, 1321, 2115 తేడాతో జపాన్‌కు చెందిన నాగహారామస్తుమోటో జంటను ఓడించింది. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. తొలి సెట్‌లో విజయం కోసం రెండు జోడీలు సర్వం ఒడ్డి పోరాడాయి.

అయితే చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమైన అశ్విని జోడీ సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో మాత్రం జపాన్ జంట ఆధిపత్యం చెలాయించింది. దూకుడుగా ఆడుతూ అలవోకగా గేమ్‌ను సొంతం చేసుకుంది. కానీ ఫలితాన్ని తేల్చే మూడో గేమ్‌లో మాత్రం భారత జంట పుంజుకుంది. దూకుడుగా ఆడుతూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఇదిలావుంటే పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. హాంకాంగ్ ఆటగాడు అగ్నస్‌తో జరిగిన పోరులో శ్రీకాంత్‌కు చుక్కెదురైంది. దూకుడుగా ఆడిన అగ్రస్ 2113, 2117 తేడాతో శ్రీకాంత్‌ను ఓడించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News