Thursday, January 23, 2025

సాత్విక్-చిరాగ్ జోడీకి షాక్

- Advertisement -
- Advertisement -

మూడో స్థానానికి పడిపోయిన భారత బ్యాడ్మింటన్ జంట
టాప్ 10లోనే సింధు
న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్‌చిరాగ్ శెట్టిలు మొదటి ర్యాంకును కోల్పోయారు. ఏడాది కాలంగా నిలకగా రానిస్తూ టైటిల్స్ గెలుచుకున్నా వారి టాప్ ర్యాంకు చేజారింది. మంగళవారం అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య విడుదల చేసిన ర్యాంక్సిలో సాత్విక్, చి రాగ్‌ల జోడీ మూడో స్థానానికి పడిపోయారు. ఇ క లియాంగ్ వీ కెంగ్, వాంగ ఛాంగ్(చైనా) జోడీ టాప్ ర్యాంకును కైవసం చేసుకోగా.. డెన్మార్క్ చెందిన కింగ్ అస్ట్రుప్, అండర్స్ స్కారుప్ రస్ముస్పెన్స్ జోడీ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక పురుషుల సింగిల్స్‌లో భారత్ స్టార్ షట్లర్లు ఎస్‌హెచ్ ప్రణయ్, లక్షసేన్‌లు టాప్ 15లో నిలిచారు, ప్రణయ్ 10వ ర్యాంకు, లక్షసేన్ 14వ ర్యాంకులలో కొనసాగుతున్నారు. కాదాంబి శ్రీ కాంత్ ఏకంగా 32వ ర్యాంకుకు పడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో గత కొంతకాలంగా సతమతవుతున్న పివి సింధు ఎప్పటిలాగే పదో స్థానం లో కొనసాగుతోంది. రెండేళ్లు ఒక్క టైటిల్ కూడా నెగ్గని ఆమె టాప్ 10లో కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News