Monday, December 23, 2024

సెమీ ఫైనల్లో సాత్విక్‌చిరాగ్ జోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డిచిరాగ్ శెట్టి జోడీ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో వరల్డ్ నంబర్3 సాత్విక్ జంట విజయం సాధించింది. జపాన్‌కు చెందిన హోకికొబయాషి జంటతో జరిగిన ఫైనల్లో సాత్విక్ జోడీ జయకేతనం ఎగుర వేసింది. రెండు సెట్లు సమరంలో భారత జోడీ 2114, 2117 తేడాతో జయభేరి మోగించింది. ఆరంభం నుంచే సాత్విక్‌చిరాగ్‌లు ఆధిపత్యం చెలాయించారు.

ప్రత్యర్థి జంటను హడలెత్తిస్తూ లక్షం దిశగా అడుగులు వేశారు. ప్రత్యర్థి జంట ఏ దశలోనూ భారత్ జోడీకి కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయింది. అద్భుత సమన్వయంతో ఆడిన సాత్విక్‌చిరాగ్‌లు సునాయాసంగా తొలి సెట్‌ను దక్కించుకున్నారు. రెండో సెట్‌లో కూడా భారత జోడీ దూకుడును ప్రదర్శించింది. ఈసారి జపాన్ జంట కాస్త పోటీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. చివరి వరకు దూకుడుగా ఆడిన సాత్విక్ జంట సెట్‌ను గెలిచి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగే సెమీ ఫైనల్లో సాత్విక్ జోడీ చైనాకు చెందిన లియాంగ్‌వాంగ్ జంటతో తలపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News