న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మకమైన థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్ జోడీ 2115, 2115 తేడాతో లియు ఇ(చైనీస్ తైపి), బి.చెన్ (చైనా) జంటను ఓడించింది. ఆరంభం నుంచే భారత జంట ప్రత్యర్థి జోడీపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
దూకుడుగా ఆడుతూ లక్షం దిశగా అడుగులు వేసింది. వీరి ధాటికి ప్రత్యర్థి జంట పూర్తిగా చేతులెత్తేసింది. తీవ్ర ఒత్తిడికి గురై వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తమకు అనుకూలంగా మార్చడంలో సాత్విక్, చిరాగ్‌లు సఫలమయ్యారు. చివరి వరకు దూకుడుగా ఆడుతూ వరుసగా రెండు సెట్లను గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్లో సాత్విక్చిరాగ్లకు ఇది రెండో ట్రోఫీ కావడం విశేషం. కిందటి సీజన్లో కూడా ఈ జోడీ అత్యంత నిలకడైన ప్రదర్శనతో అదరగొట్టిన విషయం తెలిసిందే.