Thursday, January 23, 2025

సాత్విక్-చిరాగ్ జోడీకి టైటిల్

- Advertisement -
- Advertisement -

యొసు : కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జోడీ సాత్విక్‌చిరాగ్ సంచలనం సృష్టించింది. టైటిల్ పోరలో విజయం సాధించి కొరియా ఓపెన్ విజేతగా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇండోనేషియాకు చెందిన టాప్ సీడ్ ఫజర్ అలిఫియాన్, రియాన్ ఆర్డియాంటో జోడీపై 17-21, 21-13, 21-14తో ఘన విజయం సాధించింది. హోరాహోరోగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను భారత జోడీ 17-21తో ఓడిపోయినా రెండో గేమ్‌లో అద్భుతం పుంజుకొని అలవోకగా 21-13తో గెలిచింది. ప్రత్యర్థి సర్వీసులను పదే పదే బ్రేక్ చేస్తూ ఆధిపత్యం చెలాయించింది.

ఇక కీలకమైన మూడో గేమ్‌లోనూ ప్రత్యర్థి జోడీకి అవకాశం ఇవ్వకుండా 21-14తో గేమ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు మ్యాచ్ విజేతగా నిలిచింది. తద్వారా 33,180 డాలర్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నారు సాత్విక్‌చిరాగ్ జోడీ. గత నెల ఈ జోడీ ఇండోనేషియా ఓపెన్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరంలో సాత్విక్-చిరాగ్ జోడి మూడు బిడబ్ల్యూటిఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్స్‌ను కైవసం చేసుకుంది. స్విస్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్, తాజాగా కొరియా ఓపెన్‌లను ఖాతాలో వేసుకుంది. కాగా, ఈ జోడీకి ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News