Tuesday, January 21, 2025

క్వార్టర్ ఫైనల్లో సాత్విక్‌చిరాగ్ జోడీ

- Advertisement -
- Advertisement -

ఒలింపిక్స్ పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్‌చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. సోమవారం వీరు ఆడాల్సిన రెండో మ్యాచ్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. దీంతో సాత్విక్ జంట మ్యాచ్ ఆడకుండానే క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఒలింపిక్స్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. సాత్విక్ జోడీ సోమవారం జర్మనీకి చెందిన మార్క్‌మెర్విన్ జంటతో తలపడాల్సి ఉంది. అయితే మార్క్‌కు గాయం కావడంతో అతను ఒలింపిక్స్ నుంచి వైదొలిగాడు. దీంతో ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ లక్షసేన్ గ్రూప్ దశ మ్యాచ్‌లో విజయం సాధించాడు. బెల్జియం ఆటగాడు జులియన్‌తో జరిగిన పోరులో లక్షసేన్ 2119, 2114 తేడాతో జయకేతనం ఎగుర వేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News