Wednesday, January 22, 2025

ఎదురులేని సాత్విక్-చిరాగ్ జోడీ

- Advertisement -
- Advertisement -

పారిస్: పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్‌చిరాగ్ శెట్టి మరో విజయం సాధించింది. మంగళవారం ఇండోనేషియాకు చెందిన మహ్మద్ రియాన్‌ఫజర్ అల్ఫియాన్ జంటతో జరిగిన పోరులో సాత్విక్ జంట జయభేరి మోగించింది. 40 నిమిషాల పాటు సాగిన పోరులో భారత జంట 2113, 2113 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే భారత జోడీ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థి జోడీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగింది. ఇదే క్రమంలో వరుసగా రెండు సెట్లు గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News