Thursday, January 23, 2025

మరోసారి ఫైనల్లో బోల్తా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇటీవలె ముగిసిన మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్‌లో టోర్నీ ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచిన భారత బ్యాడ్మింటన్ పురుషుల జోడీ సాత్విక్‌చిరాగ్ ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్‌లో మరోమారు ఫైనల్ సమరంలో బోల్తా కొట్టారు. దీంతో మరోసారి రన్నరప్‌గా నిలిచారు. ఇండియా ఓపెన్ సూపర్ 750 బాడ్మింటన్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ విభాగంలో దక్షిణ కోరియాకు చెందిన సియో సీయాంగ్‌కాంగ్ మిన్ జంటతో తుదిపోరులో తలపడ్డారు. హోరాహోరిగా సాగిన ఈ పోరులో సాత్విక్ జోడీ 2115, 1121, 1821తో ఓటమిని చవిచూశారు.

కాగా, ఈ ఏడాది సాత్విక్ జోడీకి ఇది రెండో ఓటమి. ఈ పోరులో భారత జోడీ అద్భుతమైన ఆటతీరుతో సియో సీయాంగ్ జోడీపై ఆధిపత్యం చెలాయించి 2115తో తొలి గెమ్‌ను సొంతం చేసుకున్నా.. ఇక రెండో గేమ్‌లో వరుస పాయింట్లు సాధించడంతో సీ యాంగ్ జోడీ 1121తో సాత్విక్ జోడీని మ ట్టికరిపించింది. ఇక నిర్ణాయాత్మక మూడో గేమ్‌లో తొలుత భారత జోడీ 812తో వెనుకబడినా అద్భుతమై పాయింట్లతో 1617తో దాదాపు సమం చేశారు. ఈ తరుణంలో జోరు పెంచిన కోరియా జోడీ సాత్విక్ జోడీకి అవకాశమివ్వకుండా వరుస పాయిం ట్లు సాధించి 1821తో గేమ్ సొంతం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News