Monday, December 23, 2024

ఫైనల్లో సాత్తిక్ జోడీ

- Advertisement -
- Advertisement -

కౌలాలంపూర్: ప్రతిష్ఠాత్మకమైన మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన సాత్విక్‌ సాయిరాజ్‌చిరాగ్ శెట్టి జోడీ ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్లో భారత జంట 2118, 2220 తేడాతో దక్షిణ కొరియాకు చెంది ఎం.హెచ్ కాంగ్, ఎస్.జె.సియో జంటను ఓడించింది. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇరు జోడీలు కూడా ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డాయి.

దీంతో ఆసక్తికర పోరు నెలకొంది. తొలి సెట్‌లో సాత్విక్ జోడీ అత్యంత నిలకడైన ఆటను కనబరిచింది. ప్రత్యర్థి జట్టు నుంచి ఎదురైన సవాల్‌ను తట్టుకుంటూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో సెట్‌ను కూడా దక్కించుకుంది. రెండో సెట్‌లో కూడా పోరు హోరాహోరీగానే కొనసాగింది. ఈసారి కొరియా జంట మరింత దూకుడైన ఆటతో అలరించింది. దీంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. కానీ తీవ్ర ఒత్తిడిలోనూ నిలకడైన ఆటను కనబరిచిన భారత అగ్రశ్రేణి జోడీ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News