- Advertisement -
యంగ్ హీరో సత్య దేవ్ ప్రస్తుతం యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు క్రాంతి బాల దర్శకత్వం వహిస్తుండగా శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు. మంగళవారం సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి ‘గరుడ చాప్టర్-1‘ అనే స్ట్రయికింగ్ టైటిల్‌ని లాక్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో సత్య దేవ్ తన వీపుపై ఒక చిన్న పాపని మోస్తూ అడవిలో నిలబడి ఒక చేతిలో కాగడ, మరొక చేతిలో గొడ్డలితో కనిపించారు.
- Advertisement -