Monday, December 23, 2024

దేశంలోని పరిస్థితులను ప్రతిబింబించే సినిమా..

- Advertisement -
- Advertisement -

హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో సికె స్క్రీన్స్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ మీడియాతో మాట్లాడుతూ.. “గాడ్సే చిత్రంలో సమాజాన్ని ప్రశ్నించే విశ్వనాథ్ రామచంద్ర పాత్రలో నటించాను. ‘గాడ్సే’ టైటిల్ వివాదాస్పదంగా ఉండవచ్చేమో కానీ.. ఈ కథకు సరైన టైటిల్ ఇది. సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో గాంధీ, గాడ్సే అనే నాటకం ఉంటుంది. అయితే ఈ సినిమా టైటిల్ ఒక బజ్ క్రియేట్ చేయడానికి ముందు పెట్టాలని అనుకొన్నాం. బజ్ లేకపోతే సినిమా రీచ్ ఉండదు కదా.. అందుకే కథలోని పాయింట్‌ను తీసుకొని పెట్టాం. ఇక టైటిల్‌కు జస్టిఫికేషన్ ఉంది. దేశంలోని ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించే చిత్రమిది. ఒక రకంగా ఇది ఇండియన్ చిత్రం. పదేళ్ల క్రితం తీసినా.. మరో పదేళ్ల తర్వాత తీసినా ఈ కథకు రీచ్ ఉంటుంది. సొసైటీలోని అస్తవ్యస్త అంశాలను ప్రశ్నించడమనేది ఈ సినిమా కథ. గాడ్సే సినిమాలో తొలి సీన్ నుంచి.. చివరి సీన్ వరకు భావోద్వేగ సన్నివేశాలు ఉంటాయి. థియేటర్ నుంచి ప్రేక్షకుడు బయటకు వచ్చిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుడు తనతోపాటే కథ, కథనాలను వెంట తీసుకెళ్తాడు. తప్పకుండా ఈ చిత్రం ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది”అని అన్నారు.

Satya Dev Interview about GODSE Movie

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News