Thursday, January 23, 2025

నటనలో శిక్షణ కోసం

- Advertisement -
- Advertisement -

సినిమాలో నటించాలంటే డైలాగ్స్, డ్యాన్స్ ఉంటే సరిపోదు వీటికి తోడు యాక్టింగ్, ఫైటింగ్ ఇలా ఎన్నో రకాల మెళుకువల్లో శిక్షణ పొందాలి. అలాంటి వారికోసం అన్నీ ఒకే చోట సరికోత్త శిక్షణ ఇచ్చేలా ‘సత్య ఫిల్మ్ అకాడమీ’ ప్రారంభమైంది. డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ఎంతో పేరు సంపాదించుకున్న సత్య మాస్టర్ ఇంతకు ముందు సత్య ఫిలిం స్టూడియో, సత్య డి.జోన్స్ ఇన్సిట్యూట్‌లు పెట్టి ఎంతో మందికి డ్యాన్స్‌లో శిక్షణ ఇచ్చిరు. అయితే ఒక్క డ్యాన్స్‌కే పరిమితం కాకుండా ట్యాలెంట్ ఉన్న యువతీ, యువకులకు నటనతో పాటు అన్నీ రకాల శిక్షణ ఇచ్చి పరిపూర్ణ నటులను తయారు చెయలనే ఉద్దేశ్యంతో సత్య ఫిల్మ్ అకాడమీని ప్రారంభించారు.

హైదరాబాద్‌లో ఏర్పాటైన ఈ అకాడమీని ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు ప్రసన్నకుమార్, జీవితా రాజశేఖర్, సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, హీరో సంపూర్ణేష్ బాబు, రాకేష్ మాస్టర్ చేతులమీదుగా ‘సత్య ఫిల్మ్ అకాడమీ’ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సత్య మాస్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఎంతోమంది యువతకు టాలెంట్ ఉన్నా సరైన శిక్షణ లేక అవకాశం దొరకడం కాదు. అది గమనించి వారికి సపోర్ట్ ఇవ్వాలని ‘సత్య డి.జోన్’ డ్యాన్స్ అకాడమీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా యాక్టింగ్ నేర్చుకోవాలనే తపనపడే యువతీయువకులు చాలామంది నాకు తారసపడ్డారు. అటువంటి వారి కోసం ‘సత్య ఫిల్మ్ అకాడమీ’ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కల్వకుంట్ల తేజస్వి, బీగల గణేష్ గుప్త, జితేంద్ర, రవి, భగవత్, రాధా మోహన్, జలదంకి సుధాకర్, కుద్దూస్, శ్యామల రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News