Saturday, December 21, 2024

నా చావుకు ఆ నలుగురే కారణం..

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి  : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగిరాయిపల్లి మాజీ సర్పంచ్ సత్యాగౌడ్ అదృశ్యం కలకలం రేపుతోంది. తన చావు కు ఆ నలుగురే కారణమంటూ ఆయన తీసిన సెల్ఫీ విడియోపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అదృశ్యమై సత్యాగౌడ్ గ్రామ సర్పంచ్ భర్త అధికం నర్సా గౌడ్ అనుమానస్పద మృతి కేసులో అరెస్టై ఇటీవల బేయిలుపై బయటకు వచ్చాడు. సెల్ఫీలో తాను గ్రామంలో సీసీ రోడ్డు పనులు చేశానని దాని బిల్లుకు సంభందించిన చెక్కు వచ్చినా పని చేసినట్లు రుజువు ఏంటనీ ఎంపివో సరిత ఇవ్వలేదన్నారు. చెక్కు తనకు రాకుండా గ్రామానికి చెందిన అధికం రాజెందర్ గౌడ్ తో పాటు తోట భూమ య్య, గొల్ల అంజయ్య,

ఇసాయిపేట్ సర్పంచ్ బాలాగౌడ్ కలసి చెక్కును అధికం నిఖిల్ గౌడ్ రాసుకున్నారని సూసైడ్ నోట్ సెల్ఫీ విడియో పేర్కొన్నారు. ఇప్పటికే అప్పుల బాద తాళలేక అర ఎకరం భూమి అమ్ముకున్నాని, ఇప్పేడు డబ్బులు రాకుండా అడ్డుకోవడంతో మనోవేదనకు గురై సూసైడ్ చేసుకుంటానని పుర్కొన్నా డు. తన చావుకు ఆ నలుగురే కారణమని సెల్ఫీ తీసుకున్న మోబైల్ ఫోన్, బైకు ఇంటి వద్దనే ఉంచి ఆదివారం ఇంటి వెల్లిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. బైయిల్ పై వచ్చిన తరువాత కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో నివాసం ఉంటుంన్నామని తెలిపారు. సత్యాగౌడ్ అదృశ్యమైనట్లు సోమవారం కుటుంబ సభ్యులు కామారెడ్డి పట్టణ పోలీస్టేషన్లో ఫిర్యాధు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News