అమరావతి: తల్లిపాలతో బిడ్డకు రోగనిరోధకశక్తి పెరుగుతుందని ఎపి వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో తల్లిపాల బ్యాంకును సత్యకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తల్లిపాలు తాగిన బిడ్డలకు గర్భాశయ, రొమ్ము కాన్సర్ల ముప్పు ఉండదన్నారు. పది నెలల్లోనే ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ చేపట్టామని, సమస్యలు పరిష్కరిస్తున్నామని సత్యకుమార్ చెప్పారు. బోధనాసుపత్రుల్లో సిబ్బంది ఖాళీల వ్యవహారం వైసిపి ప్రభుత్వం నిర్లక్షమేనని మండిపడ్డారు. వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి శ్రీసత్యసాయి జిల్లాకు ఎందుకు వస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. జగన్ రాజకీయం చేయడానికే పాపిరెడ్డిపల్లికి వస్తున్నారని పేర్కొన్నారు. శాంతిభద్రతలు బాగున్నాయనే..పర్యటనలతో రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో కుట్రలు పెంచడానికే జగన్ ఈ పర్యటన చేస్తున్నారని సత్యకుమార్ ఆరోపణలు చేశారు.
జగన్ తో అక్కడ కుట్రలు జరుగుతున్నాయి: సత్యకుమార్
- Advertisement -
- Advertisement -
- Advertisement -