హైదరాబాద్: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు సత్య నాదెళ్ల చైర్మన్ గా నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ జాన్ థామ్సన్ స్థానంలో నాదెళ్లను నియమించారు. ఇప్పటికే ఆ సంస్థ సిఇవొగా ఉన్న సత్య నాదెళ్లకు చైర్మన్ గా అదనపు బాధ్యతలు కట్టబెట్టింది మైక్రోసాఫ్ట్. బోర్డు చైర్మెన్ గా సత్య నాదెళ్లను ఏకగ్రీవంగా ఎన్నకున్నట్టు మైక్రోసాప్ట్ ప్రకటించింది. జాన్ థామ్సన్ ను స్వతంత్ర డైరెక్టర్ గా నియమించింది. సత్య నాదెళ్ల మైక్రోసాప్ట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 2014లో స్టీవ్ బామర్ స్థానంలో మైక్రోసాఫ్ట్ కు సత్య నాదెళ్ల సిఇవోగా ఎన్నికయ్యారు. అదే ఏడాది సంస్థ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్థానంలో థాంప్సన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే, ఇప్పుడు థాంప్సన్ స్థానాన్ని సంస్థ నాదెళ్లకు అప్పగించింది. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సిఒవోగా ఎంపికై తెలుగు కీర్తిని ఖండాంతరాలకు విస్తరించిన సంగతి తెలిసిందే.
Satya Nadella Appointment of as Chairman of Microsoft