- Advertisement -
అమరావతి: గత ప్రభుత్వం రీ సర్వేను భ్రష్టు పట్టించిందని, తప్పుల తడకగా నిర్వహించిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రీ సర్వే ప్రతిష్టాత్మకంగా సాగుతోందని అన్నారు. అసెంబ్లీలో ప్రశోత్తరాల సమయంలో భాగంగా మాట్లాడుతూ..తమ ప్రభుత్వం ఆ తప్పులను సరి చేస్తోందని తెలియజేశారు. రీ సర్వేను ఎంతో పకడ్బందీగా చేస్తున్నామని, సర్వేశాఖ ఉద్యోగులు కూడా కీలకపాత్ర పోషిస్తున్నారని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
- Advertisement -