Sunday, December 22, 2024

మెగాస్టార్‌తో క్లైమాక్స్ పెద్ద హైలెట్

- Advertisement -
- Advertisement -

భారతీయ చిత్ర పరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటిస్తున్న ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. స్టైలిష్ ఫిల్మ్‌మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’ అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న నేపధ్యంలో సత్యదేవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “చిరంజీవి అన్నయ్య గ్రేస్, క్రేజ్‌కి వందకి వంద శాతం సరిపడే కథ ఇది. మునుపెన్నడూ కనిపించని కొత్త లుక్‌లో ఆయన కనిపిస్తున్నారు. సీన్లు పేల్తాయి. ఇంటర్వెల్ బ్లాక్ నా ఫేవరేట్. మాములుగా వుండదు. మోత మోగిస్తుంది. థార్ మార్… పాట కూడా అదిరిపోతుంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో చిరంజీవి, నాకు మధ్య ఉండే 14 నిమిషాల యాక్షన్ సీన్ ఇందులో ఒక హైలెట్. దీనికంటే మించి ఇందులో చాలా వున్నాయి. ఆద్యంతం ఎత్తుకు పైఎత్తు అన్నట్టుగా వుంటుంది ఈ సినిమా. దర్శకుడు మోహన్ రాజా ప్రతి పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు. ఇందులో నా పాత్రని చాలా స్టయిలిష్, పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు”అని అన్నారు.

Satyadev interview about God Father

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News