Friday, March 21, 2025

ఆసుపత్రిని పిపిపి మోడ్ లో నిర్మిస్తాం : సత్యకుమార్

- Advertisement -
- Advertisement -

అమరావతి: గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో అనేక ప్రాజెక్టులు చేపట్టారని, వాటిని చిత్తశుద్ధితో పూర్తి చేయలేకపోయారని ఎపి విద్య, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ విమర్శించారు. జీరో వేకెన్సి పాలసీ ఉందని వైసిపి ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పిందని, రివ్యూ చేస్తే 26 శాతం ఖాళీలు ఉన్నాయని మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో ఐదు ఆసుపత్రుల నిర్మాణానికి 9.9 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. గ్రామాల్లో సర్వీసులు అందిస్తే సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించే విషయం ఆలోచిస్తామని చెప్పారు. వంద పడకల ఆసుపత్రిని పిపిపి మోడ్ లో నిర్మిస్తామని సత్యకుమార్ తెలియజేశారు. నందిగామలో ఐదు ఎకరాల స్థలం కొనుగోలులో అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. 2.5 ఎకరాల్లో ఉన్న ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేసి వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మెడికల్ కాలేజీ నందిగామ నియోజకవర్గానికి ఇవ్వడం సాధ్యం కాదని  సత్యకుమార్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News