- Advertisement -
అమరావతి: అక్రమాలు, అవినీతి బయట పడుతుండటంతో వైసిపి కుట్రలు చేస్తుందని వైద్య, విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. తమ అవినీతి వెలుగులోకి వస్తుందంటే..డ్రామాలకి వైసిపి తెరలేపుతోందని అన్నారు. సత్యసాయి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..సిట్, ఈడి కేసులు ఎదుర్కొంటున్న సమయంలో..సున్నిత అంశాలపై రచ్చ చేయడం వైసిపికి అలవాటుగా మారిందని విమర్శించారు. హిందూ ధర్మంపై నమ్మకం లేనివారు…టిటిడి సొమ్ము కాజేసిన వారు ఇలాంటివి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దొంగ ఓట్ల అంశం వెలుగులోకి వస్తుండటంతో వైసిపి డ్రామాలని, దొంగ ఓట్ల వెనుక భూమన అభినయరెడ్డి హస్తం ఉందన్నారు. లడ్డూ కల్తీ కేసులు నిజాలు బయటికి వస్తున్నాయని సత్యకుమార్ పేర్కొన్నారు.
- Advertisement -