Sunday, December 22, 2024

‘సత్యం సుందరం’ బ్యూటీఫుల్ ఫిల్మ్: కార్తీ

- Advertisement -
- Advertisement -

హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పెషల్ గెస్ట్‌లు పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో కార్తీ మాట్లాడుతూ “సత్యం సుందరం… సిరిమల్లె చెట్టు లాంటి బ్యూటీఫుల్ ఫిల్మ్. ఈ సినిమాని చాలా మనసుపెట్టి చేశాం”అని అన్నారు. ఈ వేడుకలో నిర్మాత సురేష్ బాబు, హీరోయిన్ శ్రీదివ్య, డైరెక్టర్ ప్రేమ్ కుమార్, రాకేందు మౌళి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News