Thursday, December 26, 2024

నాగర్ కర్నూల్ లో నరహంతకుడు…. 11 మంది హత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లాలో సీరియల్ కిల్లర్ తాంత్రిక పూజలతో ఇప్పటివరకు 11 మందిని హతమార్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాదులో జరిగిన హత్యతో సీరియల్ కిల్లర్ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు సత్యం యాదవ్ ఉన్నారు.  వనపర్తి జిల్లా నాగపూర్ లో నలుగురిని హత్య చేయడంతో పాటు నాగర్ కర్నూల్ జిల్లా గన్యాగుల సమీపంలో మరో హత్యతో అతడికి సంబంధం ఉన్నట్లు సమాచారం. మరో రెండు హత్యలకు సంబంధించి సత్యం యాదవ్ నిందితుడిగా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇతనిపై అనేక ఆరోపణలు వచ్చిన పోలీసులు పట్టించుకోవడంలేదని బాధితుల కుటుంబాలు ఆరోపణలు చేస్తున్నాయి. భూములు ఆస్తి తగాదాలే ప్రామాణికంగా హత్యలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరిపితే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన హత్యలలో బాధితుల భూములను కాజేసినట్లు పోలీసులకు సమాచారం అందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News