రైతులేమైనా నాకోసం చనిపోయారా అన్నారు
ప్రధాని అహంకారి అమిత్ కలిస్తే ఆయనకు
(మోడీ) తప్పిందన్నారు హర్యానాలో జరిగిన
కార్యక్రమంలో మేఘాలయ గవర్నర్ షాకింగ్ కామెంట్స్
పెనుదుమారం రేపుతున్న సత్యపాల్ వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డిఎ గవర్నమెంట్‌పై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసి న సంచలన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ప్రధాని మోడీ ఒ క అహంకారి అని మాలిక్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అమిత్‌షా కూడా ప్రధాని మతిపోయిందని వ్యాఖ్యానించినట్లు మాలిక్ ఆరోపించారు. ఆదివారం హార్యానాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘ఇటీవల రైతుల సమస్యలపై మాట్లాడేందుకు నేను ప్రధానిని కలిశాను. ఈ సందర్భంగా కేవలం ఐదు నిమిషాల్లోనే ప్రధానిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చాలా అహంకారం ప్రదర్శించారు. మన రైతులు దాదాపు 500 మంది చనిపోయారు అని నేను ప్రస్తావిస్తుండగానే .. ‘వాళ్లు నా కోసం చనిపోయారా..? అంటూ ప్రధాని స్వరం పెంచార’ని చెప్పారు. ప్రధాని ప్రశ్నకు తాను అవును అని సమాధానం మాలిక్ పేర్కొన్నారు. మీరు రాజు కాబట్టి రైతుల మరణాలకు మీరే బాధ్యులని చెప్పానని తెలిపారు. తర్వాత ప్రధాని తనకు హోంమంత్రి అమిత్‌షాను కలిసి మాట్లాడమని చెప్పారని, ఆయన చెప్పినట్లే తాను అమిత్‌షాను కలిశానని అన్నారు. ఈ సందర్భంగా అమిత్‌షా ప్రధానిని ఉద్దేశించి ‘సత్యా ఆయనకు మతి తప్పింది’ అని వ్యాఖ్యానించనట్లు ఆరోపించారు. కుక్క చచ్చినా సంతాప లేఖ పంపే ప్రధాని రైతుల మరణాలపై స్పందించలేదని విమర్శించారు. ఇక ప్రధానితో పోరాటానికి స్వస్తి పలుకుతున్నానని అన్నారు.
నిజంగా షాకే..: కెటిఆర్
ఎన్డీయే గవర్నమెంట్ అపాయింట్ చేసిన మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నోటి నుంచి ఈ మాటలు రావడం నిజంగా షాకేనని కెటిఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాలిక్ వ్యాఖ్యల వీడియోను కెటిఆర్ షేర్ చేశారు. ప్రస్తుతం మాలిక్ వ్యాఖ్యలు రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్నాయి.