Sunday, February 23, 2025

ఆటోను ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: సత్యసాయి జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి వద్ద ఆదివారం ఉదయం ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై ఆటోను కారు ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతులు ఆటో డ్రైవర్ చిన్నస్వామి, భాస్కర్ నాయక్, చలపతి నాయక్‌గా గుర్తించారు. మృతులు బుక్కపట్నం మండలం బుదిరేబైలుతండాకు చెందిన వాసులుగా గుర్తించారు.

Also Read: వన్ నేషన్-వన్ ఎలక్షన్ కాదు… అది వన్ పార్టీ-వన్ పర్సన్ ది: రేవంత్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News