Saturday, December 21, 2024

కవిత నిర్విరామ పోరాటంతోనే మహిళా రిజర్వేషన్ బిల్లు: సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్‌ఎస్‌ పోరాటం ఫలించిందని రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదంపై మంగళవారం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మహిళ బిల్లు పై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బిఆర్ఎస్ పోరాటానికి కేంద్రం తలొగ్గిందని, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కేంద్రానికి లేఖ రాసి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద పాత్ర పోషించారని చెప్పారు. ఈ ఘనత సిఎం కెసిఆర్ కృషితో సాధ్యమైందని పేర్కొన్నారు. మహిళా బిల్లుపై ఎమ్మెల్సీ కవిత నిర్విరామ పోరాటంతో గెలుపు సాధించామన్నారు.

గతంలోనూ లోక్‌సభలో ఎంపీగా ఎమ్మెల్సీ కవిత అనేక సందర్భాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లుతో పాటు మహిళా సాధికారతపై గళం విప్పారని చెప్పారు. మార్చిలో ఎమ్మెల్సీ కవితతో కలిసి మేము ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేయడం, రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై దాదాపు 47 రాజకీయ పార్టీలను కవిత ఏకతాటిపైకి తీసుకువచ్చారు. 33 శాతం రిజర్వేషన్ అమలతో దేశ వ్యాప్తంగా మహిళలకు గొప్ప అవకాశం దక్కిందన్నారు. ఆకాశంలో సగం, భూమిలో సగం అధికారంలో సగం అనే నినాదం అమలు కానుందని, మహిళలకు ఈ సందర్భంగా మంత్రి సత్యవతి శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News