Wednesday, January 22, 2025

త్వరలో మరో రెండు గిరిజన గురుకులాలు

- Advertisement -
- Advertisement -

 ప్రైవేట్‌కు దీటుగా నాణ్యమైన విద్య
 దేశానికి ఆదర్శంగా తెలంగాణ గురుకులాలు
 గిరిజన విద్యార్థులకు ల్యాప్‌టాప్స్, నగదు ప్రోత్సాహకాలు పంపిణీ
 మంత్రి సత్యవతి రాతోడ్

మన తెలంగాణ /హైదరాబాద్: గిరిజన బిడ్డలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపట్టారని గిరిజన, మహిళా- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గతంతో పోల్చితే గిరిజనుల్లో అక్షరాస్యత శాతం అత్యధికంగా పెరిగిందని అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో గురువారం ఐఐటి, ఎన్‌ఐటి, ఐఐఐటి, నీట్ విభాగాల్లో సీట్లు సాధించిన గిరిజన గురుకుల విద్యార్థులకు మంత్రి సత్యవతి రాథోడ్ ల్యాప్ టాప్‌లు, నగదు ప్రోత్సాహకాలను అందించారు. మొత్తం 43 మంది విద్యార్థులకు లాప్ టాప్‌లు, ఒక్కొక్కరికి 50 వేల క్యాష్ ప్రైజ్ ను అందించారు. విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో గిరిజన విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 93 గిరిజన గురుకులాలను స్థాపించటం జరిగిందన్నారు. వీటి ద్వారా వేలాది మంది గిరిజనులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందుతున్నదని పేర్కొన్నారు. ప్రతిభ కళాశాలలను ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యార్థిని విద్యార్థులకు ఐఐటి నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉచిత నాణ్యమైన శిక్షణ అందిస్తు,న్నామని, శిక్షణ ద్వారా ప్రతి సంవత్సరం వందల మంది జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో ప్రవేశాలు పొందున్నారని, ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 22 ప్రతిభా కళాశాలు, 2 పివిటిజి కళా శాలలు నిర్వహించబడుతున్నాయన్నారు. 2020 -21 విద్యా సంవత్సరానికి 43 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్ లు నగదు పురస్కారాలు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్, డిప్యూటి సెక్రటరీ చంద్రశేఖర్, ఓ ఎస్ డి స్వర్ణలత ఓ ఎస్ డి శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News