Sunday, December 22, 2024

రెడ్యానాయక్ ను పరామర్శించిన సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఇటీవల మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్ గాయత్రి హిల్స్ లోని వారి నివాసానికి చేరుకున్న డోర్నకల్ ఎంఎల్ఎ రెడ్యా నాయక్ ను రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. రెడ్యానాయక్ ఆరోగ్య వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, విశ్రాంతి తీసుకోవాలని త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.  పరామర్శించిన వారిలో ఎంపి మాలోత్ కవిత, నర్సంపేట ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు శ్రీరంగారెడ్డి, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News