Sunday, December 22, 2024

ములుగు తరువాత అత్యధిక పోడు పట్టాలు నర్సంపేటకు: సత్యవతి

- Advertisement -
- Advertisement -

వరంగల్: కాళేశ్వరం నీళ్లు వస్తుండడంతో భూముల విలువ రూ.5 వేల నుంచి రూ.50 లక్షలకు పెరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. గురువారం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. నర్సంపేటకు ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చారని మండిపడ్డారు. పెద్ది సుదర్శన్ రెడ్డిపై సిఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక అభిమానం ఉందని దయాకర్ పేర్కొన్నారు.

నర్సంపేట ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు అని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అన్ని చోట్లా జిల్లా కేంద్రాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే ఇక్కడ నియోజకవర్గానికి రావడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. నర్సంపేటలో 25 శాతం గిరిజనులు ఉన్నారని, ములుగు తరువాత అత్యధిక పోడు పట్టాలు నర్సంపేటలో ఇచ్చారని సత్యవతి ప్రశంసించారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో దళిత, గిరిజన ఆడబిడ్డలకు మేలు జరిగిందన్నారు.

Also Read: దేశ ప్రజల ఆహార కొరతను స్వామినాథన్ తీర్చారు: హరీష్ రావు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News