Monday, January 20, 2025

ఎంఎల్‌ఎ రెడ్యానాయక్‌ను అడ్డుకున్న మంత్రి సత్యవతి వర్గీయులు

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: ఎంఎల్‌ఎ రెడ్యానాయక్‌ను మంత్రి సత్యవతి రాథోడ్ వర్గీయులు అడ్డుకున్నారు. మహబూబాబాద్ జిల్లా మొగిలిచర్లలో ఎంఎల్‌ఎ రెడ్యానాయక్‌ను అడ్డుకున్నారు. కురవి మండలం బంగ్యా తండాలో ఐదు లక్షల రూపాయల సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసేందుకు ఎంఎల్‌ఎ రెడ్యానాయక్ రావడంతో మంత్రి వర్గీయులు అడ్డుకున్నారు. ఎంఎల్‌ఎకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో వాహనం ముందుకు వెళ్లకుండా పడుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పల్లె పల్లెకు రెడ్యానాయక్ పర్యటన విషయం చెప్పడం లేదంటూ ఆందోళన చేశారు. ఎంఎల్‌ఎ గో బ్యాక్ అంటూ సత్యవతి రాథోడ్ వర్గీయులు నినాదాలు చేశారు. గత కొన్ని రోజులగా రెడ్యానాయక్, సత్యవతి అనుచరుల మధ్య రాజకీయంగా విభేదాల ఉన్నాయి. ఈ విబేధాలు తారాస్థాయికి చేరుకోవడంతో అప్పుడప్పుడు ఘర్షణలకు దారితీస్తున్నాయి.

Also Read: పెళ్లి మాట విని రాంగోపాల్ వర్మ ఏమన్నారంటే…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News