Friday, January 24, 2025

గిరిజన రిజర్వేషన్లకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

కేంద్ర హోంమంత్రికి సత్యవతి
రాథోడ్ లేఖ 2017లో రాష్ట్ర
అసెంబ్లీ ఆమోదించి పంపిన
తీర్మానాన్ని ఆమోద ముద్ర
వేయాలని డిమాండ్ గిరిజన
రిజర్వేషన్లను పెంచాలని గతంలో
కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ
చేసిన సిఫారసులు విసరించారా
అని మంత్రి నిలదీత

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రా ష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపుకు సంబంధిం చి రాష్ట్ర అసెంబ్లీ పంపిన ఏకగ్రీవ తీర్మానాన్ని ఆ మోదించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి మంగళవా రం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాశా రు. ఉమ్మడి రాష్ట్రం లో 6 శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్లు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం గిరిజన జనాభా 9.08ఉందని దీని ప్రకా రం గిరిజన రిజర్వేషన్లను 6శాతం నుండి 10శా తానికి పెం చుతూ 2017 లో రాష్ట్ర శాసనసభ ఏకుగ్రీవ తీర్మానం చేసి, బిల్లు ఆమోదంతో కేంద్ర హోం శాఖకు పంపించిందని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. గిరిజన రిజర్వేషన్లతో పాటు బిసి -ఇ రిజర్వేషన్లు 12 శాతానికి పెంచుతూ అసెం బ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని దీనిపై కేంద్ర నిర్ణ యం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టి న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. బిసి-ఇ రిజర్వేషన్ల అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని అది తేలే వరకు గిరిజన రిజర్వేషన్ల పెంపుపై ఏ నిర్ణయం తీసుకోలేమని కేంద్ర హోం శాఖ స హాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా గత ఫిబ్రవరి 1న రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి లేఖ రాసిన విషయాన్నిగుర్తు చేశారు.

జనభాకనుగుణంగా గిరిజన రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటన ప్రజల్లో ఆయోమయానికి గురిచేసిన విషయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. బిసి-ఇ రిజర్వేషన్లపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని, గిరిజన రిజర్వేషన్లపై ఎలాంటి కేసులేదని ఆమె గుర్తు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు 6 శాతం నుండి 9.08 శాతానికి పెంచే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ సిఫార్సు చేసిన విషయాన్ని ఆమె ఆ లేఖలో గుర్తు చేశారు. బిసి-ఇ రిజర్వేషన్ల పెంపు అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దానికి అభియన్స్‌లో పెట్టి గిరిజన రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదం తెలుపాలని ఆమె తన లేఖలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపించిన తీర్మానం ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిత్వశాఖ వద్ద పెండింగ్‌లో ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News