Wednesday, January 22, 2025

మహిళతో టిడిపి ఎంఎల్ఎ శృంగారం… వీడియో లీక్

- Advertisement -
- Advertisement -

తిరుపతి: సత్యవేడు టిడిపి ఎంఎల్‌ఎ కోనేటి ఆదిమూలం రాసలీలల వీడియో లీకైంది. చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడి చేశారని ఎంఎల్‌ఎ కోనేటి ఆదిమూలంపై టిడిపి అధిష్టానానికి సదరు మహిళ ఫిర్యాదు చేసింది. ఆదిమూలం ఎంఎల్‌ఎ అయిన తరువాత తనపై కక్ష గటి అసభ్యకరంగా ప్రవర్తించాడని సదరు మహిళ ఆరోపణలు చేసింది. తనతో వివాహేతర సంబంధం కొనసాగించాలని ఆమెపై ఎంఎల్‌ఎ ఒత్తిడి తీసుకొచ్చినట్టు ఆరోపణలు చేసింది. పలుమార్లు ఫోన్ చేసి తనని టార్చర్ చేశాడని తెలిపింది. ఎంఎల్‌ఎ ఆదిమూలం తనని లైంగికంగా వేధిస్తున్నాడని తన భర్తకు చెప్పడంతో కామాంధుడి బుద్ది చెప్పాలని నిర్ణయం తీసుకున్నామని, పెన్‌లో కెమెరా పెట్టుకొని ఎంఎల్‌ఎ చెప్పిన బీమాస్ ప్యారడైజ్ హోటల్‌కు వెళ్లానని తెలియజేశారు. తనతో ఆదిమూలం అసభ్యంగా ప్రవర్తిస్తుండగా వీడియో రికార్డు చేసి తన భర్తకు అప్పజెప్పడం జరిగిందని వివరించారు. సదరు ఎంఎల్‌ఎ నుంచి తన కుటుంబానికి ప్రాణభయం ఉందని, ఆదిమూలంపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.

మహిళతో చనువుగా ఉన్న వీడియో వైరల్ పై ఎంఎల్ఎ ఆదిమూలం స్పందించారు.  తానేంటో తన పనితనం ఏంటో సత్యవేడు  నియోజకవర్గ ప్రజలకు తెలుసనని టిడిపి ఎంఎల్ఎ ఆదిమూలం తెలిపారు. కావాలనే కొందరు టిడిపి నాయకులు తనపై కుట్ర చేశారన్నారు. ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ వీడియో చూస్తే మార్ఫింగ్ చేసినట్టు కనబడుతోందని ఆదిమూలం పేర్కొన్నారు. తనపై రాజకీయంగా కుట్ర జరిగిందని మండిపడ్డారు. 
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News