Sunday, December 22, 2024

సత్యేంద్రజైన్‌కు బెయిల్ నిరాకరణ

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆమ్‌ఆద్మీపార్టీ మంత్రి సత్యేంద్రజైన్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ప్రత్యేక జడ్జి జస్టిస్ వికాస్ ధుల్, సత్యేంద్రకు బెయిల్ మంజూరు చేయలేదు. తమను తప్పుతోవ పట్టించారని, విచారణకు సహకరించడం లేదని సత్యేంద్ర బెయిల్ పిటిషన్‌ని వ్యతిరేకిస్తూ ఈడీ అధికారులు వాదనలు వినిపించారు.

కోర్టు సత్యేంద్ర బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడం ఇది రెండోసారి. జూన్‌లో కూడా ఆయన బెయిల్ దరఖాస్తుని ఢిల్లీ కోర్టు కొట్టేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయి బెయిల్ కోసం ఎదరుచూస్తున్న వైభవ్ జైన్, అంకుశ్ జైన్‌లకు కూడా చుక్కెదురైంది. మనీలాండరింగ్ కేసులో మే 30 న సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News