ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆమ్‌ఆద్మీపార్టీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు తీహార్ జైల్లో ఉంటున్నారు. అయితే, జైలులో ఆయనకు విఐపి సేవలు అందుతున్నాయనే వార్తలు బయటికి రావడంతో ఈమధ్యే తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. తాజాగా జైన్ మసాజ్ చేయించుకున్న వీడియోలు కూడా విడుదలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సత్యేంద్ర ఉంటున్న సెల్‌లో ఓ వ్యక్తి అతనికి కాళ్లు వత్తిన దృశ్యాలు బయటకు వచ్చాయి. అంతే కాకుండా తలకు మసాజ్ చేయించుకున్న ఫుటేజీ కూడా బయటకు రావడంతో.. విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇదంతా సెప్టెంబర్ నెలలో జరిగినట్లు తెలుస్తోంది. ఇక జైన్ ఉన్న గదిలో ప్రత్యేకమైన సదుపాయాలు కూడా ఉన్నాయి. మినరల్ వాటర్ బాటిల్స్ కూడా కనిపించాయి. అజిత్‌ను సస్పెండ్ చేసిన కొద్ది రోజులకే ఈ వీడియోలు బయటకు వచ్చాయి.
ఈ కేసులో సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఇరుపక్షాల వాదనలు విన్న ప్రత్యేక జడ్జి జస్టిస్ వికాస్ ధుల్, సత్యేంద్రకు బెయిల్ మంజూరు చేయలేదు. తమను తప్పుదోవ పట్టించారని, విచారణకు సహకరించడం లేదని సత్యేంద్ర బెయిల్ పిటిషన్‌ని వ్యతిరేకిస్తూ ఈడి అధికారులు వాదనలు వినిపించారు. కోర్టు సత్యేంద్ర బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడం ఇది రెండోసారి. జూన్ నెలలో కూడా ఆయన బెయిల్ దరఖాస్తుని ఢిల్లీ కోర్టు కొట్టేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయి బెయిల్ కోసం ఎదురుచూస్తున్న వైభవ్ జైన్, అంకుశ్ జైన్‌లకు కూడా చుక్కెదురైంది. మనీలాండరింగ్ కేసులో మే ౩౦వ తేదీన సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యేంద్ర జైన్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని 2017 ఆగష్టు 24వ తేదీన సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదుచేసింది. ఆ ఎఫ్‌ఐఆర్ కాపీ ఆధారంగా ఈడి ఇన్విస్టిగేషన్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే సత్యేంద్రను మే ౩౦వ తేదీన అరెస్ట్ చేసి తీహార్ జైలులో పెట్టారు.
#WATCH | CCTV video emerges of jailed Delhi minister and AAP leader Satyendar Jain getting a massage inside Tihar jail. pic.twitter.com/MnmigOppnd
— ANI (@ANI) November 19, 2022