Monday, December 23, 2024

మంత్రికి జైల్లో ప్రత్యేక సౌకర్యాలు.. మరో 12 మంది అధికారుల బదిలీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆమ్‌ఆద్మీ ప్రభుత్వ మంత్రి సత్యేందర్ జైన్ ఉన్న తీహార్ జైలులో 12 మంది అధికారులను తాజాగా బదిలీ చేశారు. జైళ్ల శాఖ మంత్రి అయిన ఆయనను మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రిమాండ్ నిమిత్తం జైలులో ఉన్న ఆయనను మంత్రి పదవి నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ తప్పించలేదు. అయితే జైళ్ల శాఖను వేరొకరికి అప్పగించారు. అయితే జైలులో ఉన్న సత్యేందర్ జైన్‌కు ప్రత్యేక సౌకర్యాలు అందుతున్నట్టు ఆరోపణలు రావడంతో జైలు అధికారి అజిత్ కుమార్‌ను సోమవారం సస్పెండ్ చేశారు. తాజాగా మరో 12 మంది అధికారులను బదిలీ చేసినట్టు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News