Wednesday, January 22, 2025

తీహార్ జైలు నుంచి సత్యేంద్ర జైన్ ఆస్పత్రికి తరలింపు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: తీహార్ జైలులోని వాష్‌రూమ్‌లో కళ్లు తిరగడంతో కిందపడిన ఆప్ నాయకుడు, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను దీన్ దయాళ్ ఉపాధ్యాయను జైలు అధికారులు గురువారం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చేర్చారు. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేయడంతో గత కొద్ది రోజులుగా సత్యేంద్ర జైన్ తీహార్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. బాత్‌రూములో జారిపడిన సత్యేంద్ర జైన్‌కు వెన్నెముకకు తీవ్ర గాయమైనట్లు ఆప్ తెలిపింది. అనారోగ్యంగా ఉన్నట్లు చెప్పడంతో సోమవారం జైన్‌ను జైలు అధికారులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News