- Advertisement -
గాలే: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులకు ఆలౌటైంది. దీంతో పాక్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో కీలకమైర ఆధిక్యం లభించింది. సౌద్ షకిల్ కళ్లు చెదిరే డబుల్ సెంచరీతో పాక్‌ను ఆదుకున్నాడు. లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న షకిల్ 361 బంతుల్లో 19 ఫోర్లతో అజేయంగా 208 పరుగులు చేశాడు. అతనికి ఆఘా సల్మాల్ (83), నౌమన్ అలీ (25) అండగా నిలిచారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన శ్రీలంక మంగళవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. ఇక పాక్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అధిగమించాలంటే పాక్ మరో 135 పరుగులు చేయాలి. లంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేసింది.
- Advertisement -