Tuesday, November 5, 2024

హౌతీ క్షిపణి దాడిని అడ్డుకున్న సౌదీ అరేబియా

- Advertisement -
- Advertisement -

Saudi Arabia blocks Houthi missile attack

 

దుబాయి : యెమెన్ హౌతీ తిరుగుబాటు వర్గాల క్షిపణి దాడిని సౌదీ అరేబియా అడ్డుకుంది. దీంతో ఆ క్షిపణి శిధిలాలు పొరుగున ఉన్న డమ్మంకు సమీపాన కూలడంతో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. ఈమేరకు సౌదీ ప్రభుత్వ ప్రెస్ ఏజెన్సీ ఆ శిధిలాల దృశ్యాలను విడుదల చేసింది. దేశ రాజధానికి తూర్పు దిక్కున గల ప్రభుత్వ చమురు క్షేత్రం సౌదీ ఆరామ్‌కో ప్రధాన కేంద్రం వద్ద ఆ శిధిలాలు కూలాయి. ఆ ప్రాంతం లోని 14 ఇళ్లు దెబ్బతిన్నాయి. హౌతీలు మూడు బాంబు డ్రోన్లు, మూడు క్షిపణులతో దాడి చేశారని, మిలిటరీ అధికార ప్రతినిధి బ్రిగ్ జనరల్ టర్కి అల్ మల్కీ చెప్పారు. అయితే హౌతీ మిలిటరీ అధికార ప్రతినిధి యాహియా సరేయి మాత్రం తన ట్వీట్‌లో సౌదీ అరేబియాలో తిరుగుబాటు దారులు భారీ ఎత్తున దాడి చేశారని తెలిపారు. డమ్మంకు 55 కిమీ దూరంలో రాస్ తనూరా నగరంలో ఆరామ్‌కో వద్ద తాము క్షిపణితో దాడి చేశామని, ఎనిమిది పేలుడు డోన్లును కూడా పంపామని తిరుగుబాటు దారులు ప్రకటించారు. జెడ్డా, జిజాన్, నజ్రాన్, నగరాల్లో ఆరామ్‌కో క్షేత్రాలను లక్షంగా చేసుకుని ఐదు క్షిపణులను, రెండు పేలుడు డ్రోన్లతో దాడి చేశామని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News