Sunday, December 22, 2024

‘ఈద్ అల్-ఫిత్ర్ 2024’ ఎప్పుడు?

- Advertisement -
- Advertisement -

ఈద్ అల్-ఫిత్ర్ అనేది రంజాన్ నెల చివరి రోజు, రంజాన్ నెల సౌదీ అరేబియాలో మార్చి 11న మొదలయింది.

రియాద్: సౌదీ అరేబియా శనివారం దేశలోని ముస్లింలందరికీ అర్ధ చంద్రాకారం చంద్రుడు రంజాన్ నెల 29వ రోజు సాయంత్రం కనిపిస్తే…మామూలు కంటికి కనిపించినా, బైనాకులర్స్ ద్వారా చూసినా ఆ వివరాలను తమకు దగ్గరలోని కోర్టుకు తెలుపాలని సౌదీ అరేబియా సుప్రీం కోర్టు ముస్లింలకు పిలుపునిచ్చింది. సోమవారం అర్ధ చంద్రకారం చంద్రుడు కనిపిస్తాడా లేదా అన్నది చూడమని సౌదీ అరేబియా ముస్లింలకు పురమాయించింది.

ఒకవేళ సోమవారం (ఏప్రిల్ 8న) రంజాన్ నెల చివరి రోజయితే, మంగళవారం(ఏప్రిల్ 9) షవ్వాల్ నెల మొదలవుతుంది. చాంద్రమాన కాలమానం ప్రకారం ఇస్లామీయ నెల 29 లేక 30 రోజులుంటుంది. కానీ ఒకవేళ రంజాన్ నెల 30 రోజులకు ముగిస్తే షవ్వాల నెల బుధవారం(ఏప్రిల్ 10) మొదలు కాగలదు. షవ్వాల్ అర్ధ చంద్రకారం నెలవంక కనిపించిన రోజే ఈద్ అల్-ఫిత్ర్ మొదలవుతుంది. అది మంగళవారం లేదా బుధవారం కాగలదు. ఈద్ అల్-ఫిత్ర్ తోనే రంజాన్ పవిత్ర మాసం ముగుస్తుంది. రంజాన్ పవిత్ర మాసం ఈ ఏడాది మార్చి 11న మొదలయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News