Saturday, April 19, 2025

సౌదీ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం

- Advertisement -
- Advertisement -

పిల్లలతో సహా హజ్ యాత్ర కు వెళ్ళాలనుకునే వారికి సౌదీ ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. 12 ఏళ్ళలోపు పిల్లలను హాజ్ యాత్రకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా హజ్ యాత్రకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. రాష్ట్రం నుండి తల్లిదండ్రులతో కలిసి హజ్ యాత్రకు వెళ్తున్న 12 ఏళ్ల లోపు పిల్లల సంఖ్య 38 ఉంది. ఇప్పటికే వీరు హజ్ యాత్రకు సంబంధించి రుసుము చెల్లించి యాత్రకు సిద్దమయ్యారు. చివరి నిముషంలో సౌదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీరంతా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. 38 మంది పిల్లల యాత్ర రద్దు కావడంతో పాటు వారి తల్లిదండ్రులు కూడా తమ యాత్రను రద్దు చేసుకుంటున్నారు.

చిన్న పిల్లలను వదిలి హజ్ యాత్రకు వెళ్లడం సాధ్యం కానందున తల్లిదండ్రులు ఇప్పటికే తమ యాత్రను రద్దు చేసుకున్నారు. 10 నుండి 12 ఏళ్ల వయస్సు ఉన్న కొంత మంది పిల్లల తల్లిదండ్రులు తమ బంధువుల వద్ద వారిని వదిలి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. చిన్న పిల్లలు మాత్రం తల్లిదండ్రులను వదిలి ఉండలేని పరిస్తితి ఉన్నందున తల్లిదండ్రులు కూడా తమ యాత్రను రద్దు చేసుకుంటున్నట్ల రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ గులాం అఫ్జల్ బియా బాని తెలిపారు. వారు చెల్లించిన డబ్బులను తిరిగి చెల్లిస్తున్నట్లు తెలిపారు. సౌడీ ప్రభుత్వం పిల్లలను హజ్ యాత్రకు అనుమతించక పోవడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. యాత్ర రద్దు చేసుకున్న 12 ఏళ్ళ లోపు పిల్లల వివరాలను రాష్ట్ర హజ్ కమిటి వెల్లడించింది.

మరోవైపు హజ్ యాత్రీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపౌ రాష్ట్ర హజ్ కమిటీ దృష్టి సారించింది. హజ్ యాత్ర ప్రారంభంతో పాటు సౌదీలో వారికి కల్పించాల్సిన ఏర్పాట్లు, ఇక్కడి నుండి బయలు దేరి యాత్ర పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అందులో బాగంగా బుధవారం చైర్మన్ సయ్యద్ గులాం అఫ్జల్ బియాబానీ అధ్యక్షతన హజ్ కమిటీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసన సభ్యులు మొహమ్మద్ జాఫర్ హుస్సేన్ మెరాజ్, అజ్మతుల్లా హుస్సేనీ, ముజీబుద్దీన్, లయీఖ్, ఇల్యాస్ అహ్మద్ హమిద్ ఖాస్మి, షర్ఫుద్దీన్, ఖాజా సనా, డా. సయ్యద్ అజర్ అలీ, ఎగ్జిక్యూటివ్ అధికారి సజ్జాద్ అలీ, ఎఈఓ ఇర్ఫాన్ షరీఫ్, పాల్గొన్నారు. రాబోయే హజ్ క్యాంప్ కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలు, ఏర్పాట్లు, పనులపై చర్చించారు. హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ నుండి బయలుదేరే హజ్ యాత్రికుల సంక్షేమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంపై ఈ సమావేశంలో సమీక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News