Monday, November 18, 2024

పాక్‌కు 3 బిలియన్ డాలర్ల సౌదీ సాయం

- Advertisement -
- Advertisement -

Saudi Arabia to provide $3 billion to Pakistan

ఇస్లామాబాద్: నిధుల కొరతతో అల్లాడుతున్న పాకిస్థాన్‌కు 3 బిలియన్ డాలర్ల సాయం అందించడానికి సౌదీ అరేబియా అంగీకరించినట్లు సాక్ మీడియా కథనాలు బుధవారం పేర్కొన్నాయి. ఈ వారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సౌదీ అరేబియాలో పర్యటించిన సందర్భంగా కుదిరిన ఈ ఒప్పందానికి సంబంధించిన అధికారిక ప్రకటనను ఆర్థిక, రెవిన్యూ వ్యవహారాలపై ప్రధాని సలహాదారు, ఇంధన శాఖ మంత్రి హమ్మద్ అజర్ చేస్తారని ప్రము దినపత్రిక ‘ డాన్’పేర్కొంది. కాగా సౌదీ అరేబియా అందజేసే సాయంపై పాక్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి ట్విట్టర్ ద్వారా స్పందించారు. సౌదీ అరేబియా ఈ ఏడాది 3 కోట్ల డాలర్లను పాకిస్థాన్ కేంద్ర బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తుందని, అలాగే రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల కోసం మరో 1.2 బిలియన్ డాలర్ల సాయం అందిస్తుందని ఆయన ఓ ట్వీట్‌లో తెలిపారు.

సౌదీ ప్రభుత్వం తక్షణం పాకిస్థాన్ ఖాతాలో 3 బిలియన్ డాలర్లు ఏడాది పాటు డిపాజిట్ చేస్తుందని, కనీసం 2023 అక్టోబర్‌లో అంతర్జాతీయ ద్రవ్యనిధి ( ఐఎంఎఫ్) కార్యక్రమం ముగిసే దాకా దాన్ని పొడిగిస్తూ వస్తుందని ఓ అధికారి చెప్పినట్లు ఆ పత్రిక తెలిపింది.2019 జులైలో పాకిస్థాన్, ఐఎంఎఫ్‌లు 6 బిలియన్ డారల్ల సాయానికి సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే 2020జూన్‌లో అది అర్ధంతరంగా ఆగిపోయింది. ఈ ఏడాది మార్చిలో తిరిగి పునరుద్ధరించినప్పటికీ మళ్లీ జూన్‌లో ఆగిపోయింది. ఇది కాక సౌదీ అరేబియా పాక్‌కు ఏడాది 1.5 బిలియన్ డాలర్ల విలువైన ముడిచమురునుతర్వాత చెల్లించే ప్రాతిపదికన సరఫరా చేస్తుందని కూడా ఆ పత్రిక తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News