Sunday, January 19, 2025

రొనాల్డోకు జాక్‌పాట్.. రూ.4400 కోట్లతో..

- Advertisement -
- Advertisement -

రియాద్: పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో జాక్‌పాట్ కొట్టేశాడు. ఇటీవల మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో బంధాన్ని తెంచుకున్న రొనాల్డోకు సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్ క్లబ్ అండగా నిలిచింది. రొనాల్డోకు ఏడాదికి ఏకంగా 200 మిలియన్ యూరోలను ఇచ్చేందుకు సౌదీ క్లబ్ అంగీకరించింది. భారత కరెన్సీలో ఈ ఒప్పందం విలువ ఏకంగా రూ.4400 కోట్లు కావడం విశేషం. ఇక రొనాల్డోతో ఒప్పందం విషయాన్ని అల్ నజర్ క్లబ్ యాజమాన్యం ధ్రువీకరించింది. అంతేగాక రొనాల్డోకు తమ క్లబ్ జెర్సీని బహూకరించింది. దీనికి సంబంధించిన ఫొటోలను అల్ నజర్ క్లబ్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. సమకాలిన ప్రపంచ ఫుట్‌బాల్‌లో రొనాల్డో ఎదురులేని శక్తిగా కొనసాగుతున్నాడు. అత్యుత్తమ ఆటకు మరో పేరుగా అతన్ని చెప్పవచ్చు.

సుదీర్ఘ కాలం పాటు మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించిన రొనాల్డో ఆ జట్టుకు ఎన్నో సార్లు ట్రోఫీలను సాధించి పెట్టాడు. ప్రపంచ ఫుట్‌బాల్ అత్యుత్తమ ఆటగాళ్లలో రొనాల్డో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. కాగా, 37 ఏళ్ల పోర్చుగల్ సాకర్ స్టార్‌తో డీల్ కుదుర్చుకున్న సౌదీ క్లబ్ కళ్లు చెదిరే ధరను చెల్లించేందుకు అంగీకరించింది. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన ఒప్పందంగా నిలిచిపోనుంది. మరోవైపు రొనాల్డోతో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని అల్ నజర్ యాజమాన్యం అరుదైన గౌరవంగా ప్రకటించింది.

రొనాల్డో వంటి దిగ్గజ ఆటగాడు తమ జత కట్టడం ఆనందంగా ఉందని క్లబ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇదిలావుండగా అల్ నజర్ క్లబ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రొనాల్డో కూడా ధ్రువీకరించాడు. ఇప్పటికే సుదీర్ఘ కాలం పాటు యూరోపియన్ క్లబ్‌లకు ప్రాతినిథ్యం వహించా. తాజాగా ఆసియా ఆటగాళ్లతోనూ ఆడే అవకాశం దక్కడం అరుదైన గౌరవంగా భావిస్తున్నా. క్లబ్ యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తానని రొనాల్డో స్పష్టం చేశాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News