Monday, January 20, 2025

భారత్‌కు అంతకు మించిన ఆనందం మరోటి లేదు : అజిత్ డోవల్

- Advertisement -
- Advertisement -

జెడ్డా : చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలనేది భారత్ విధానమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ అన్నారు. శాంతిని నెలకొల్పేందుకు ఇదే సరైన మార్గంగా భారత్ విశ్వసిస్తోందని చెప్పారు. ఉక్రెయిన్ అంశంపై వివిధ దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సౌదీ అరేబియా లోని జెడ్డాలో జరిగింది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చొరవతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో 42 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి రష్యాను ఆహ్వానించలేదు.

“రష్యాఉక్రెయిన్ మధ్య సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి దానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాలతో భారత్ చర్చిస్తోంది. ఈ సమస్యకు శాశ్వత సమగ్ర పరిష్కారం కనుగొనేందుకు క్రమం తప్పకుండా కృషి చేస్తోంది. ఇరు దేశాలు సంక్షోభానికి ముగింపు పలికితే భారత్ హర్షిస్తుంది” అని అజిత్ డోవల్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన నాటి నుంచి సంక్షోభానికి ముగింపు పలికేందుకు భారత్ తన వంతుగా ఇరు దేశాల అధ్యక్షులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ ఏడాది మొదట్లో జపాన్‌లో జరిగిన జీ 7 దేశాల సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. సంక్షోభానికి ముగింపు పలికేందుకు భారత్ తన వంతు కృషి చేస్తుందని ఆయనకు మోడీ తెలిపారు. అంతకు ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పలుమార్లు ప్రధాని మోడీ ఫోన్ సంభాషణలు జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News