Sunday, December 22, 2024

ఇకపై సౌదీ వీసా డిజిటల్‌లో జారీ!

- Advertisement -
- Advertisement -

జెడ్డా: భారత్ నుంచి సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు ఇకపై సౌదీ ఈ-వీసా జారీ చేయబోతున్నది. పాస్‌పోర్ట్‌లపై సంప్రదాయ వీసా స్టిక్కర్‌ను తొలగించే కొత్త విధానం మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పుడు వీసా వివరాలను సేకరించేందుకు క్యూఆర్ కోడ్ మాత్రమే చదవాలి. అయితే వీసా సమాచారం వీసా హోల్డర్ల రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడికి పంపుతారు. వారు వీసా పొందినట్లు నిరూపించడానికి హార్డ్ కాపీని కలిగి ఉండేల ఎ4 సైజ్ కాగితంపై ముద్రించవచ్చు.

ఈ కొత్త వ్యవస్థ విజన్ 2030లో భాగం, ఇది క్రమంగా డిజిటల్ గవర్నెన్స్‌ని అనుమతిస్తుంది. ఈ-వీసా చొరవ మే 1 నుండి భారత్, ఇతర ఏడు దేశాలలో అమలులోకి వచ్చింది.

భారతీయులకు ఉపాధి, సందర్శన, నివాస ఈ-వీసా వ్యవస్థ ద్వారా ప్రాసెస్ చేయబడతాయి. ఇమ్మిగ్రేషన్ అధికారులు క్యూఆర్ స్కాన్ కోడ్ ద్వారా వివరాలను సంగ్రహిస్తారు. ఈ కొత్త వ్యవస్థ ప్రాసెసింగ్‌లో సమయాన్ని తగ్గిస్తుంది. పారదర్శకతను తీసుకొస్తుంది. ముఖ్యంగా న్యూఢిల్లీ, ముంబైలలో సౌదీ వీసాలను ఆమోదించడానికి మధ్యవర్తిగా పనిచేసే ప్రస్తుత ట్రావెల్ ఏజెంట్ వ్యవస్థను తొలగిస్తుంది. ఏదేమైనప్పటికీ సౌదీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే ఏ వ్యక్తి అయినా ఇప్పుడు విఎఫ్‌ఎస్ గ్లోబల్‌వీసా ప్రాసెసింగ్ సెంటర్‌లను సందర్శించడం తప్పనిసరి, ఎందుకంటే వీసా దరఖాస్తులు వాటి ద్వారా మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి.

తెలంగాణ అంతటా సౌదీ అరేబియాలోకి సందర్శకుల ప్రవాహం ఉంది. వారి వీసాలు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ప్రాసెస్ చేయబడినందున వారి ఇళ్ల నుండి బయటకు వెళ్లకుండానే సౌదీ అరేబియాకు చేరుకుంటారు. అయితే ఇప్పుడు భౌతికంగా విఎఫ్‌ఎస్ కేంద్రాన్ని సందర్శించడం తప్పనిసరి అని ఎన్‌ఆర్‌ఐ కార్యకర్త, ఎపి ఎన్‌ఆర్‌టి కోఆర్డినేటర్ ముజామిల్ షేక్ తెలిపారు. విఎఫ్‌ఎష్ గ్లోబల్ సెంటర్ పంజాగుట్టలో పనిచేస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News